Niharika: మరోసారి ప్రేమలో పడిన నిహారిక…మా మధ్యలోకి రావద్దు అంటూ… వైరల్ అవుతున్న పోస్ట్!

Niharika: మెగా డాటర్ నిహారిక ఇదివరకే పెళ్లి చేసుకున్న తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈమె మెగా వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే కెరియర్ మొదట్లో బుల్లితెర యాంకర్ గా పనిచేస్తున్న నిహారిక అనంతరం హీరోయిన్గా అడుగుపెట్టారు కానీ ఈమె సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోలేదు.

ఇలా నిహారిక చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో తమ కుటుంబ సభ్యులు ఈమెకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఇలా జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్న నిహారిక రెండు సంవత్సరాలకి తన భర్తకు విడాకులు ఇచ్చేసి వచ్చేసారు ఇలా విడాకులు తీసుకున్న అనంతరం సినిమాలపై ఆసక్తితో తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గాను అదేవిధంగా నిర్మాతగా మారి పలు సినిమాలు వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇక తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం ఈమె ఎన్నో సందర్భాలలో తాను రెండో పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. అయితే తాజాగా నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ చూస్తే మాత్రం ఈమె మళ్లీ ప్రేమలో పడిందని స్పష్టమవుతుంది.

నిహారిక సోషల్ మీడియా వేదికగా మైనర్ పాస్ పోర్ట్ అనే హ్యాండిల్ తన గురించి రాసిన ఒక నోట్ ప్యాడ్ ని షేర్ చేస్తూ ‘నేను అతన్ని ప్రేమిస్తున్నాను..అంబటి భార్గవి దయచేసి నువ్వు మా ఇద్దరి స్నేహం మధ్యలోకి రాకు. ఓకే థాంక్స్..బై’ అంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఈమె పోస్ట్ చేయడంతో నెటిజన్స్ఒక్కసారిగా నిహారిక మళ్ళీ ప్రేమలో పడిందా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా మైనర్ పాస్ పోర్ట్ అనే హ్యాండిల్ ఎవరిది అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ హ్యాండిల్ చిన్నపిల్లాడిది అనే విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. నిహారికకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమనే విషయం మనకు తెలిసిందే. ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్ని కూడా బయట పెట్టారు. చిన్నపిల్లలతో ఉంటే తాను కూడా చిన్న పిల్లగా మారి అల్లరి చేస్తానని నిహారిక తెలిపారు.