పెళ్ళికి ముందు మొద‌లు పెట్టిన నిహారిక సినిమా మార్చిలో రాబోతుంది..!

మెగా బ్ర‌ద‌ర్ ముద్దుల కూతురు నిహారిక ముద్దపప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. కొన్ని వెబ్ సిరీస్‌ల త‌ర్వాత ఒక మ‌న‌సు అనే చిత్రంతో వెండితెర డెబ్యూ ఇచ్చింది. ఈ చిత్రం నిరాశ‌ప‌ర‌చిన‌ప్ప‌టికీ నిహారిక వరుస సినిమాలు చేసుకుంటూనే వెళ్లింది. మంచి హిట్ అనేది ఆమెకు అంద‌ని ద్రాక్ష‌గా మారింది. ఈ నేప‌థ్యంలో త‌ను ప్రేమించిన వ్య‌క్తిని గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకుంది. అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా పాల్గొంది.

O Man | Telugu Rajyam

ప్ర‌స్తుతం నిహారిక త‌న దృష్టిని వెబ్ సిరీస్‌ల‌పైనే పెట్టిన‌ట్టు తెలుస్తుంది. పెళ్ళి త‌ర్వాత ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ముందుకొచ్చిన ఈ ముద్దుగ‌మ్మ అన‌సూయ‌తో క‌లిసి అల‌రించేందుకు సిద్ధ‌మైంది. అయితే పెళ్లికి ముందే ఓ త‌మిళ సినిమాలో న‌టిస్తున్నట్టు చెప్పుకొచ్చిన నిహారిక ఆ మూవీకి సంబంధించిన ప‌లు ఫొటోలు విడుద‌ల చేసింది. ఇవి నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అయితే ఈ సినిమా తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ కోసం మేక‌ర్స్ ఓ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

2018లో నిహారిక ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్ అనే త‌మిళ‌ సినిమాలో యువరాణి పాత్రలో నటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడ నటించాడు. ప్రస్తుతం తెలుగులో విజయ్ సేతుపతికి మంచి పాపులారిటీ దక్కడంతో ఆయన నటించిన పాత తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. అందులో భాగంగ‌ ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్ అనే తమిళ సినిమాను ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్‌తో మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తాజాగా ప్రకటిచింది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. అపోలో సంస్థ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాకు అర్ముగ కుమార్ దర్శకుడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles