Nidhhi Agerwal : ఇన్సైడ్ టాక్ : ఈ తమిళ్ స్టార్ హీరోతో డేటింగ్ లో ఉన్న నిధి అగర్వాల్..?

Nidhhi Agerwal : మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మంచి గ్లామరస్ హీరోయిన్స్ జాబితా తీస్తే అందులో నిధి అగర్వాల్ కూడా ఒకరు. తన కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి ఆఫర్స్ అందుకుంది. తర్వాత “ఇస్మార్ట్ శంకర్” తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయ్యి అదిరిపోయే ఆఫర్స్ ను ఈమె అందుకొని కెరీర్ ని ఇప్పుడు కొనసాగిస్తోంది.

అయితే అక్కడ నుంచే నిధి అగర్వాల్ లో యూత్ లో కూడా ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. మరి ఇప్పుడు ఇలాంటి యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ఓ ప్రముఖ హీరోతో డేటింగ్ లో ఉందని ఇంట్రెస్టింగ్ న్యూస్ లు వైరల్ అవుతున్నాయి.

మరి తాజాగా వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్ ప్రకారం నిధి అగర్వాల్ తమిళ సినిమాకి చెందిన ఓ స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ హీరో మరెవరో కూడా కాదట శింబు అని తెలుస్తుంది. అయితే వీరి కాంబోలో ఆల్రెడీ ఓ సినిమా ఉన్న సంగతి తెలిసిందే.

అక్కడ నుంచే వీరి పరిచయం స్టార్ట్ కాగా ప్రస్తుతం వీరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఇంకా ఎంతమేర నిజముందో చూడాలి. ఇక మన తెలుగులో అయితే లేటెస్ట్ గా నిధి నటించిన చిత్రం “హీరో” రిలీజ్ కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “హరిహర వీరమల్లు” అనే బిగ్ ప్రాజెక్ట్ లో ఈమె నటిస్తుంది.