రామ్ చరణ్ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ?

బాలీవుడ్ లో ‘జంజీర్’  అనే  సినిమాతో ఎంట్రీ ఇచ్చినా…రామ్ చరణ్ కి మాత్రం రాజమౌళి RRR సినిమాతోనే   పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ‘ఆచార్య’ లాంటి డిసాస్టర్ తర్వాత రామ్ చరణ్ మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

తాజాగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒక రోల్ ప్రస్తుత జనరేషన్ లో ఉంటె…ఇంకో క్యారెక్టర్ ప్రీ-ఇండిపెండెన్స్ టైం లో జరుగుందంట.

పీరియడ్ డ్రామా లో ఒక రామ్ చరణ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి శిష్యుడిగా ఉంటాడంట. అలాగే ఫ్రీడమ్ ఫైట్ లో కూడా పాల్గొంటాడు. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో రణ్వీర్ సింగ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.