నేటి నుండే టోల్ గేట్ల వద్ద కొత్త రూల్ … ఫాస్టాగ్ లేకపోతే పరిస్థితి ఏంటి ?

జాతీయ రహదారులపై రయ్యిమంటూ దూసుకెళ్లే వాహనదారులకు ఓ ముఖ్య గమనిక. మీకు ఇప్పటికే ఫాస్టాగ్ ఉంటే ఫర్వాలేదు. అయితే ఇంకా మీరు ఫాస్టాగ్ ను పొందకుంటే మాత్రం ఇకపై తిప్పలు తప్పవు. టోల్ గేట్ల వద్ద భారీ రద్దీని తొలగించేందుకు, సులభతర చెల్లింపుల మేరకు కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 80శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు.

 ఫాస్టాగ్ విషయంలో వాటిని జారీ చేసిన సంస్థలు పెట్టిన మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను రద్దు చేసింది. అంతేకాకుండా వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లో టోల్ చార్జి చెల్లించేందుకు తగిన డబ్బులేకున్నా పేమెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయాలనీ, ఫాస్టాగ్ అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఏర్పడితే, తదుపరి రీచార్జ్ నుంచి మినహాయించుకోవచ్చునని తెలిపింది.

రోజూ 89 కోట్ల రూపాయలను ఫాస్టాగ్ ద్వారానే వసూలు చేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని 2.54 కోట్ల మందికి పైగా వాహనదారులు ఇప్పటికే ఫాస్టాగ్ ను పొందారు. అదే సమయంలో ఫాస్టాగ్ విషయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కూడా కేంద్రం పరిష్కారం చూపించింది. ఫాస్టాగ్ విషయంలో వాటిని జారీ చేసిన సంస్థలు పెట్టిన మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను రద్దు చేసింది. అంతేకాకుండా వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లో టోల్ చార్జి చెల్లించేందుకు తగిన డబ్బులేకున్నా పేమెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయాలనీ, ఫాస్టాగ్ అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఏర్పడితే, తదుపరి రీచార్జ్ నుంచి మినహాయించుకోవచ్చునని తెలిపింది.

ఫాస్టాగ్ ఖాతా నెగిటివ్ లో ఉన్నట్టయితే వారిని టోల్ గేట్ల నుంచి అనుమతించబోమని వెల్లడించింది. దీంతో వాహనదారులకు ఫాస్టాగ్ విషయంలో ఓ భారీ ఊరట లభించినట్టయింది. ఇక ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ రహిత చెల్లింపులు ఉండవు. ఫాస్టాగ్ లేని వారికి ప్రత్యేక కౌంటర్లు ఏమీ ఉండవు. అయితే ఫాస్టాగ్ లేని వారి పరిస్థితి ఏంటీ, అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ విషయమై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఫాస్టాగ్ లేని వారి విషయంలో పలు సూచనలు జారీ చేసింది.

ప్రతీ టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ కౌంటర్లు ఉంటున్నాయి. ఫాస్టాగ్ లేని వారు ఆ కౌంటర్ల వద్దకు వెళ్లి ఫాస్టాగ్ ను కొనుక్కోవచ్చు. అదే సమయంలో వాహనం ఆ టోల్ గేట్ నుంచి బయటకు వెళ్లాలంటే మాత్రం డబుల్ చార్జీ చెల్లించాల్సిందే. సోమవారం నుంచి టోల్ గేట్ల వద్ద అన్ని లేన్లు పాస్టాగ్ లేన్లుగా మారిపోయాయి. ఉదాహరణకు మీ వాహనం టోల్ చార్జీ 100 రూపాయలు అనుకోండి. ఫాస్టాగ్ లేకున్నా మీ వాహనం ఫాస్టాగ్ లేన్ లోకి వచ్చింది కాబట్టి పెనాల్టీతో సహా మొత్తం రెండు వందల రూపాయలు చెల్లిస్తేనే ఆ వాహనం టోల్ గేట్ ను దాటుతుంది.