నీతో మూవీ రివ్యూ

నటీనటులు: అభిరామ్ వర్మ, సాత్విక రాజ్, రవివర్మ, సుంజిత్ అక్కినేపల్లి, నేహా కృష్ణ, కావ్య రామన్, అపూర్వ శ్రీనివాసన్, రాజీవ్ కనకాల…

దర్శకత్వం : బాలు శర్మ

నిర్మాతలు: పృథ్వీ క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్

సంగీతం: వివేక్ సాగర్

ఈ వారం చాలా చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’, ‘క్రేజీ ఫెలో’ తో పాటు ‘నీతో’ అనే సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ :

వరుణ్ (అభిరామ్ వర్మ) ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగం చేస్తుంటాడు. కానీ తను  వరుణ్ టార్గెట్స్ ను రీచ్ కాలేకపోతాడు. టార్గెట్ రీచ్ అవ్వలేకపోవడంతో  వరుణ్ జాబ్ రిస్క్ లో పడుతుంది.  ఇలాంటి టఫ్ టైమ్స్ లో వరుణ్ కి మేఘన (సాత్విక రాజ్) మ్యారేజ్ ఇన్సూరెన్స్ పాలసీ చేసే ఛాన్స్ వస్తోంది.

ఈ 2 కోట్ల పాలసీ తో  వరుణ్, మరియు  అతని ఫ్రెండ్స్ జాబ్స్ పోకుండా గట్టెక్కుతారు.  అయితే, కొన్ని అనుకోని పరిణామాల మధ్య మేఘన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. దీని తర్వాత వరుణ్ కి – మేఘన కి మధ్య రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఇద్దరి మధ్య కలిగిన ఫీలింగ్స్ విషయంలో క్లారిటీ కోసం ఇద్దరు ఎదురు చూస్తుంటారు. మరీ ఈ ఇద్దరికీ తమ లవ్ విషయంలో స్పష్టత వస్తోందా ?, రాదా ?, చివరకు ఈ ఇద్దరి లవ్ స్టోరీ ఎలా సాగింది ? ఇది తెలియాలంటే సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు రాసుకున్న సున్నితమైన కథాంశం బాగుంది. ప్రేమ కోసం హీరో – హీరోయిన్ పడే తపన మరియు కొన్ని లవ్ సీక్వెన్స్ లు.. ఇక ఎమోషనల్ గా సాగే సెకెండ్ హాఫ్ ఇంప్రెస్స్ చేస్తాయి. హీరో బాబాయ్ పాత్రలో రాజీవ్ కనకాల నటన చాలా బాగుంది. హీరో, హీరోయిన్స్ చాలా బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ మూవీ చాలా సింపుల్ పాయింట్ చుట్టతో తిరుగుతుంది. మధ్య బలమైన కాన్ ఫ్లిక్ట్ ఏముంది ? అనే డౌట్ దగ్గరే ఆడియన్ ఉండిపోయాడు. దానికి తగ్గట్లుగానే హీరో అభిరామ్ వర్మ పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం కూడా సినిమాకు మైనస్ అయింది. స్టోరీ మరీ స్లో గా ఉండడంతో అక్కడక్కడా బోర్ అనిపిస్తుంది.

తీర్పు:

టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. కొన్ని ఎమోషన్స్, కొన్ని ప్రేమ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో కీలకమైన సీన్స్ బోర్ గా సాగడం, అలాగే వెరీ స్లో నేరేషన్ వలన ఈ మూవీ అంతగా ఆకట్టుకోదు.