కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్‌కు గరిష్ట వయోపరిమితిని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్‌కు జనరల్ కేటగిరి అభ్యర్థులకు 25 ఏళ్లు, రిజర్వేషన్ కేటగిరి వారికి 30 ఏళ్ల వయోపరిమితి నిబంధన ఉండేది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ హాజరు అయ్యే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని తొలగించినట్లు జాతీయ వైద్య కమిషన్ (NMC) తెలిపింది. నీట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి నిర్ణీత గరిష్ట వయోపరిమితి ఉండకూడదని నిర్ణయించినట్టు వెల్లడించింది.
NEET: నీట్ రాసేవారికి గుడ్‌న్యూస్.. వయోపరిమితి ఎత్తివేత!
