ప్రస్తుతం బీజేపీ హవా బాగానే నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇవాళ విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ చూసినా బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. బీహార్ ఎన్నికల్లోనూ బీజేపీ తన సత్తా చాటింది. ఎన్డీఏ కూటమి బీహార్ పీఠాన్ని చేజిక్కించుకుంది. అధికారంలోకి రావడానికి కావాల్సిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీని ఎన్డీఏ కూటమి సాధించడంతో… బీహార్ లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయం అయిపోయింది.
బీహార్ లో అధికారంలోకి రావాలంటే కావాల్సిన సీట్లు 122. ఆ మార్కును ఎన్డీఏ దాటేసి.. 123 సీట్లు సాధించింది. బీహార్ లో ఉన్న 243 స్థానాల్లో 123 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయకేతనం ఎగురవేసింది. ఇక.. మహాకూటమి కూడా ఎన్డీఏకు గట్టి పోటీని ఇచ్చింది. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 108 స్థానాలు గెలిచింది.
మరోవైపు మరో పార్టీ ఎల్జేపీ మాత్రం ఈ ఎన్నికల్లో ఒకే ఒక సీటును గెలుచుకుంది. ఇతర పార్టీలు 7 స్థానాలను గెలుచుకున్నాయి.