Nazriya : నజ్రియా ఫహాద్: ఆ హీరోతో జత కట్టనున్న విలన్ భార్య.?

Nazriya : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప మేనియా కనిపించింది. ‘పుష్ప’ సినిమాలోని పాటలూ, వీడియోలూ, డాన్సులూ.. ఇలా ఒక్కటేమిటీ యావత్ ప్రపంచం చుట్టేసి ట్రెండింగ్ అయిపోయాయ్.
ఇప్పుడు ‘పుష్ప – ది రూల్’ పేరుతో రెండో ప్రస్థానం తెరకెక్కుతోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటించిన సంగతీ తెలిసిందే. లేట్‌గా క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన విలన్ ఫహాద్ ఫాజిల్ కొద్ది నిముషాలు మాత్రమే తెరపై కనిపించినా తన ఇంపాక్ట్‌తో రెండో పార్ట్‌పై అంచనాలు అమాంతం పెంచేశాడు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈయన గురించి అయితే కాదండోయ్. ఈయన భార్య, రీల్ కాదు రియల్ లైఫ్ భార్య గురించి. పేరు నజ్రియా ఫహాద్. అప్పుడెప్పుడో ‘రాజా రాణి’ అనే ఓ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు నజ్రియా. తన నాటీ యాక్టింగ్‌తో ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేసింది నజ్రియా. చేసినవి చాలా తక్కువ సినిమాలే. కానీ, ఈ ముద్దుగుమ్మకి బోలెడంత క్రేజ్ ఏర్పడింది ఎందుకో తెలీదు.
అప్పుడెప్పుడో యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమాలో నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు జోరుగా వినిపించాయ్. కానీ అది జరగలేదు. ఇప్పుడు నాని హీరోగా వస్తున్న ‘అంటే సుందరానికి’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ క్రేజీ భామ నజ్రియా. అయితే, తాజా సమాచారం ప్రకారం నజ్రియా మరో తెలుగు ప్రాజెక్టు పైనా సైన్ చేసిందనీ తెలుస్తోంది.
‘పుష్ప 2’ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టులో ఈ ముద్దుగుమ్మ భాగం కానుందట. రిలీజ్ కాకుండానే ‘అంటే సుందరానికి’ సినిమా పోస్టర్లలో నజ్రియా కేక పుట్టిస్తోంది. క్రిస్టియన్ అమ్మాయ్ లీల పాత్రలో నజ్రియా కనిపించబోతోంది ఈ సినిమాలో. త్వరలోనే ‘అంటే సుందరానికి’ సినిమాతో ప్రేక్షకుల్నిపలకరించనుంది నజ్రియా ఫహాద్.