Nazriya : టాలీవుడ్‌లో నజ్రియాకు భారీ వసూళ్లు వస్తున్నాయి

Nazriya : నజ్రియా నజీమ్ ఫహాద్.. ‘అంటే సుందరానికీ..’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి, నజ్రియా ఎప్పుడో తెలుగు తెరపై తెరంగేట్రం చేసి వుండాలి. అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా నటించిన ఓ సినిమా కోసం నజ్రియా పేరు తెరపైకొచ్చింది. అయితే ఆమె అప్పట్లో ఆ సినిమా చేయలేకపోయింది.

హీరోయిన్‌గా కెరీర్ పాడైపోతుందేమో.. అన్న ఆలోచన చేయకుండా ప్రేమించిన పహాద్ ఫాజిల్‌ని పెళ్ళాడింది. ఫహాద్ అంటే, ‘పార్టీ లేదా పుష్పా..’ అంటూ ‘పుష్ప’ సినిమాలో సందడి చేసిన విలక్షణ నటుడు. నజ్రియా నిజానికి పెళ్ళయ్యాక సినిమా అవకాశాలు రావేమోననే అనుకుంది. అయినా, పెళ్ళి వైపే మొగ్గు చూపింది.

కానీ, పెళ్ళయ్యాక కూడా నజ్రియాకి సినిమా అవకాశాలొస్తున్నాయి. పైగా ప్రెస్టీజియస్ అవకాశాలే దక్కుతున్నాయామెకి. ‘అంటే సుందరానికి’ సినిమా కోసం కూడా చాలా ఎక్కువగానే రెమ్యునరేషన్ ఆమెకు ఆఫర్ చేశారట ఆ చిత్ర నిర్మాత.

ఇదిలా వుంటే, నజ్రియా మరో తెలుగు సినిమాకి కమిట్ అయ్యింది. ఆ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ సినిమా కోసం కూడా నజ్రియా, ఓ స్టార్ హీరోయిన్ అందుకునే స్థాయిలో ‘పేమెంట్’ అందుకోబోతోందని సమాచారం.

నజ్రియా మంచి నటి. ఆ విషయం ఆమె నటించిన గత సినిమాలు (తమిళ, మలయాళ సినిమాలు) చెబుతాయ్. అందుకే ఆమెకు డిమాండ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్.. అని నజ్రియా గురించి చెబుతుంటారు.