Nayanatara: వన్స్ మోర్ అంటున్న నయన్ చిరు… మెగా 157 లో నయనతార… వీడియో వైరల్!

Nayanatara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా సీనియర్ నటి త్రిష నటించబోతున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చిరు త్రిష సందడి చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. మరి ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా ఎవరి నటించబోతున్నారు అంటూ ఇదివరకు పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించిన బోతున్నారంటూ చిత్రబృందం అధికారకంగా వెల్లడించారు. మా మెగాస్టార్‌తో తన అందం, తేజస్సును తీసుకువస్తున్న నయనతార. మా మెగా 157 ప్రయాణానికి వెల్ కం చెబుతున్నాం అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా నయనతారకు వెల్కమ్ చెప్పారు.. ఈ సందర్భంగా నయనతారపై చేసినటువంటి ఒక వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.

నయనతార మేకప్ రూమ్ లో మేకప్ చేస్తుండగా తెలుగులో మాట్లాడతారు ఇంతలోపు అసిస్టెంట్ వచ్చి మేడం తెలుగు సినిమా చేస్తున్నారన్న తెలుగులో మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నిస్తారు. ఇక కారులో చిరంజీవి పాట ప్లే అవుతుండగా అన్న చిరంజీవి గారి పాట కొంచెం సౌండ్ పెంచు అంటూ నయనతార చెబుతుంది. మేడం మీరు చిరంజీవి గారితో చేస్తున్నారా అంటూ డ్రైవర్ ప్రశ్నించగా అవును అంటూ నయనతార చెబుతుంది.

ఇక ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చి చిరంజీవి స్టైల్‌లో.. ‘హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా.’ అంటూ డైలాగ్ చెప్పగా.. అనిల్ రావిపూడి, నయనతార.. ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చి చిరు స్టైల్‌లో ‘సంక్రాంతికి రఫ్పాడించేద్దాం’ అంటూ చెప్పడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది ఇక నయనతార చిరంజీవి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా అని చెప్పాలి. ఇదివరకే వీరిద్దరూ సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.