Nayanatara: లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త ఓరియెంటెడ్ సినిమాను తాజాగా ప్రకటించారు. ఈ సినిమాకు రక్కయి అనే టైటిల్ ని ప్రకటించారు. కేవలం టైటిల్ మాత్రమే కాకుండా టీజర్ కూడా రిలీజ్ చేసారు మూవీ మేకర్స్. రక్కయి టీజర్ లో నయన్ ఏడుస్తున్న చిన్న బాబుని పడుకోబెట్టి ఆ తర్వాత తన మీదకు దాడికొచ్చిన వాళ్లపై ఒంటరిగా పోరాటం చేసింది.
కర్ర, కత్తి పట్టుకొని చీరలో మాస్ పర్ఫార్మెన్స్ ను ఇరగదీసింది నయనతార. ముఖ్యంగా యాక్షన్ అదరగొట్టేసింది. టీజర్ చూస్తుంటే ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఆ టీజర్ ని చూసిన నయనతార అభిమానులు మాస్ పర్ఫామెన్స్ తో ఇరగదీసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే నయనతార విషయానికొస్తే ప్రస్తుతం ఈమె తన పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే ఒకవైపు నిర్మాతగా మరొకవైపు హీరోయిన్గా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే గత రెండు మూడు రోజులుగా నయనతార, ధనుష్ ల వివాదం కోలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి మరి.