ఆ ప్యాన్ ఇండియా మూవీలో నయన్ పాత్ర ఏంటో తెలుసా.?

సౌత్ క్వీన్‌గా తెలుగు, తమిళ తదితర భాషల్లో తనదైన హవా చాటుతున్న నయనతార ఇంతవరకూ బాలీవుడ్‌ సినిమాపై కన్నెత్తి చూడలేదు. గతంలో చాలా అవకాశాలు వచ్చినప్పటికీ, ఎందుకో బాలీవుడ్ సినిమాపై ఆసక్తి చూపించలేదు. కానీ, నయనతార నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ అయ్యి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాయి.

ఇక ఇప్పుడు నయన్ బాలీవుడ్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌తో ఓ ప్యాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను ఎంచుకున్నారట. నయన్ పాత్రను చాలా ఎఫెక్టివ్‌గా, పవర్ ఫుల్‌గా డిజైన్ చేశారట ఈ సినిమాలో.

ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందట. అంతేకాదు, నయనతార కూడా షూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంటే, సౌత్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఈ ప్యాన్ ఇండియా మూవీతో ఇకపై బాలీవుడ్‌లో కూడా సత్తా చాటనుందన్న మాట.