బాహుబలి వెబ్ సిరీస్ లో నయనతార !

Nayanathara selected in bahubali before the begining webseries

తమిళ్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ సీనియర్ ముద్దుగుమ్మ ఒక సెన్సషనల్ ప్రాజెక్ట్ లో నటించనుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. జక్కన్న రాజమౌళి రూపొందించిన బాహుబలి మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీని వెబ్ సిరీస్ గా తీయబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‏ ఫ్లిక్స్ ఇప్పటికే ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ లో నయనతార ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం.

Nayanathara selected in bahubali before the begining webseries

బాహుబలి చిత్రాన్ని మొత్తం తొమ్మిది భాగాల వెబ్ సిరీస్‏గా నిర్మించబోతున్న నెట్‏ ఫ్లిక్స్ ఇటీవలనే బాహుబలి బిఫోర్ బిగినింగ్ అంటూ సిరీస్ షూటింగ్ కూడా ప్రారంభించారు. రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రలో ‘భలే మంచి రోజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామిక గబ్బి నటించనుంది. ప్రసాద్ దేవినేని, రాజమౌళి నిర్మిస్తుండగా… దేవకట్టా, ప్రవీణ్ సత్తార్ లాంటి ప్రతిభావంతులైన తెలుగు దర్శకులు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.