‘నార‌ప్ప‌’ రిలీజ్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్

Narappa to be screened on July 20 on Amazon Prime Video

విక్టరీ వెంకటేష్ నటించిన ‘నార‌ప్ప‌’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. వెంకటేష్ అభిమానలను నిరాశపరుస్తూ నారప్ప మూవీని ఓటిటి లోనే విడుదల చేస్తున్నారు. ముందుగా మే 14న థియేట్రికల్ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావించినా… కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కుదరలేదు. ఇక అటు తిరిగి ఇటు తిరిగి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జూలై 20వ తేదీన స్క్రీనింగ్‌ కాబోతున్నట్లుగా అధికారికంగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. చిత్ర నిర్మాతలు మంచి రేటుకే నారప్పని అమెజాన్ కు అమ్మేశారని తెలుస్తుంది. ఇక రేపో మాపో ట్రైలర్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్”కు రీమేక్ గా వస్తున్న ‘నారప్ప’ మీద అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అసురన్ లో నటనకి గాను ధనుష్ కి నేషనల్ అవార్డు లభించింది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలో వెంకీ మామ ఎలా నటించారో అని తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మాత్రమే కాకుండా వెంకీ హీరోగా నటించిన మరో మూవీ “దృశ్యం-2” కూడా ఓటిటిలోనే రిలీజ్ అవుతుందని సమాచారం.