కొత్త దర్శకుడికి ఛాన్సిచ్చిన నాని.. తగ్గేదే లే.!

‘టక్ జగదీష్’ సినిమాతో రీసెంట్‌గా ఓటీటీలో సందడి చేసిన నేచురల్ స్టార్ నాని, వరుస సినిమాలను రిలీజ్‌కి లైనులో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ లోగానే మరో కొత్త సినిమానీ లైనులో పెట్టేశాడు నాని. ఈ సారి కొత్త దర్శకుడు శ్రీకాంత్‌కి ఛాన్సిచ్చాడు నాని. ఆయన చెప్పిన కథ నానికి చాలా బాగా నచ్చేయడంతో వెంటనే ఓకే చెప్పేశాడు.

ఇప్పటికే నాని చేస్తున్న రెండు మూవీస్‌ పైనా అంచనాలు బాగానే ఉన్నాయి. కమర్షియల్ థింకింగ్ కన్నా, కథా బలానికే నాని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఈ కొత్త ప్రాజెక్టుకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నాని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నాడు నాని.

‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. అలాగే, ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో ‘అంటే సుందరానికి’ అనే డిఫరెంట్ కామెడీ ఎంటర్‌ట‌‌నర్‌ మూవీలో నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. తక్కువ గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.