హిందీలో సినిమా చేయడం అంటే ఒక మెట్టు పైకెక్కినట్టే అనుకునే హీరోలు చాలామందే ఉన్నారు. తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నా హిందీలోకి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుని చేతులు కాల్చుకున్న హీరోలు పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే ఈమధ్య పరిస్థితులు మారడంతో మన వాళ్లకు హిందీలోకి ఎంట్రీ ఈజీగా దొరికేస్తోంది. పలువురు హిందీ సినిమాల మీద దృష్టి పెట్టారు. విజయ్ దేవరకొండ, శ్రీనివాస్ బెల్లంకొండలు హిందీలో సినిమాలు చేస్తున్నారు. నానికి కూడ బాలీవుడ్లో సినిమా చేయాలనే కోరిక అంది.
ఆయన నటించిన ‘జెర్సీ’ హిందీలో రీమేక్ అవుతుండగా ‘వి’ చిత్రం డబ్ అవుతోంది. మిగిలిందల్లా స్ట్రయిట్ హిందీ పిక్చర్ చేయడమే. అయితే అక్కడ సినిమా చేయడానికి నానికి ఇక ఇబ్బంది ఉంది. అదే లాంగ్వేజ్. తనకు హిందీ వచ్చినా అది అక్కడ సినిమా చేసేంత స్థాయిలో రాదని అందుకే హిందీ స్పష్టంగా నేరుకున్నాకే అక్కడ సినిమా చేస్తానని అంటున్నారు. మరి ఎప్పుడు నేర్చుకుంటారు అంటే ఎవరైనా హిందీ దర్శకులు వచ్చి కథ చెబితే ఆ కథ తనకు విపరీతంగా నచ్చి, దీనికోసమైన హిందీ నేర్చుకోవాలని అనిపిస్తే అప్పుడు నేర్చుకుంటాను అంటున్నారు. మరి నానికి హిందీ నేర్చుకోవాలనే తపన క్రియేట్ చేసే కథ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.