Nani: హీరో నాని నిర్మాతగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్లను రాబడుతుంది.
ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వర్డిక్ట్ పేరిట గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెను చూస్తే మా అమ్మనే గుర్తుకు వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. నా మోస్ట్ ఫేవరేట్ పర్సన్ ఇన్ సినిమా ఆమెనే. రోహిణి మేడంను చూడగానే మా అమ్మనే గుర్తుకొస్తుంది. అమ్మను చూడగానే రోహిణి మేడం గుర్తొస్తుంది. ప్రతి సినిమా సెట్‌లో ఆమెను చూడగానే మా పని మొత్తం సులువుగా అయిపోతుందని తెలిపారు.
చిన్నప్పటి నుంచి కూడా నేను మణిరత్నం గారి సినిమాలకు చాలా పెద్ద అభిమానిని అయితే మణి రత్నం గారు సినిమాలలో హీరోయిన్లకు రోహిణి మేడం గారు డబ్బింగ్ చెప్పారు.అందుకే మాకు మొదటి నుంచి ఎక్కడో కనెక్షన్ ఉందినిపిస్తుంది. చాలా ఈవెంట్స్‌లో మేం ఇద్దరం చాలా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ రోజుకి ఇక్కడితో ఆపేస్తాను’ అంటూ నటి రోహిణి పై నాని తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక నాని నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 8 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది అయితే ఈ మూడు రోజులలో ఈ సినిమా సుమారు 25 కోట్లకు పైగా కలెక్షన్లను వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో మెప్పించారు.