తాజాగా తెలుగు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యిన చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించిన చిత్రం “అంటే సుందరానికీ” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా టీజర్ కి అప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి నాని కెరీర్ లోనే మరో భారీ హిట్ అయ్యిపోతుంది అనుకున్నారు.
అందుకే 30 కోట్లకి పైగా బిజినెస్ ని ఈ చిత్రం చేసేసింది. కానీ సినిమా బాగానే ఉన్నా మంచి టాక్ వచ్చినా తెలుగు స్టేట్స్ లో మాత్రం ఆడియెన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపలేదు. దీనితో ప్రస్తుతానికి అయితే 60 శాతం మాత్రమే వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది.
దీనితో ఇక్కడ ఎలాగో ప్లాప్ లిస్ట్ లోకి చేరిపోయిన ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ మాత్రం నాని విజయాన్ని అయితే ఎవరు ఆపలేకపోయారు. ఈ సినిమా ఇప్పటికీ అక్కడ 100 కి పైగా స్క్రీన్స్ లో రెండో వారంలో కొనసాగుతుంది. అంతే కాకుండా 1 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసి లాభాల్లోకి కూడా ఈ చిత్రం వెళ్ళింది.
ఇలా యూఎస్ లో మాత్రం నాని అన్ స్టాప్పబుల్ గా నిలిచాడు. కానీ తెలుగులో మాత్రం హిట్ అవ్వలేకపోయింది ఈ సినిమా. మరి నెక్స్ట్ దసరా తో అయినా నాని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. ఇక అంటే సుందరానికీ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం, వివేక్ సాగర్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం అందించారు.