హీరోగా మంచి సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్న నాని నిర్మాతగా కూడ అదే తరహాలో వెళ్తున్నారు. నిర్మాణ సంస్థను ప్రారంభించేటప్పుడే డిఫరెంట్ సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చిన ఆయన ‘అ!, హిట్’ చిత్రాలతో ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అదే పంథాలో ‘మీట్ క్యూట్’ పేరుతో ఇంకొక ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాను నాని చాలా పక్కాగా ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. ఎంతలా అంటే షూటింగ్ పూర్తికాకుండానే లాభాలు వచ్చేలా సెట్ చేసుకున్నాడు. ఈ చిత్రానికి నాని సోదరి దర్శకత్వం వహిస్తోంది. ఇందులో ఐదుగురు హీరోయిన్లు నటుస్తున్నారు.
ఈ ఐదుగురు కూడ పేరున్న హీరోయిన్లేనట. వీరందరినీ నాని చాలా తక్కువ పారితోషకానికే ఒప్పించడం జరిగిందట. ప్రతి హీరోయిన్ కు కేవలం ఐదారు రోజుల షూటింగ్ మాత్రమే ప్లాన్ చేసి తక్కువకే ఒప్పుకునేలా చేశాడట నాని. దీంతో నిర్మాణ వ్యయం సగానికి తగ్గిందట. ఇక్కడ నాని క్రెడిబిలిటీ బాగా పనిచేస్తోంది. నాని సినిమా కాబట్టి బిజినెస్ వర్గాలు కూడ సినిమాను కొనడానికి ఆసక్తి చూపుతున్నాయట. ఇప్పటికే పలువురు మంచి ధరకు సినిమాను కొనేందుకు ముందుకు వచ్చారట. త్వరలోనే బిజినెస్ క్లోజ్ అయ్యేలా ఉందని, చేతిలో డబ్బులు ఖర్చు పెట్టకుండానే నానికి మంచి లాభాలు వచ్చేలా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి నాని నిర్మాతగా మంచి లాభాలనే గడిస్తాడని తెలుస్తోంది.