హర్ట్ అయ్యిన నానీ..చాలా ఎమోషనల్ అయ్యిపోయాడు.!

నాచురల్ స్టార్ నానీ ఎంత మంచి నటుడో అందరికీ తెలిసిందే. తన మొదటి సినిమా నుంచి కూడా అత్యంత సహజ నటనతో నాచురల్ స్టార్ అనే బిరుదును తన పేరు ముందు పెట్టుకున్నాడు. మరి అంత టాలెంట్ లేకుండా నానికి అంత మంచి బిరుదు అయితే ఇవ్వరుగా.. అయినా కూడా ఇప్పటివరకు బెస్ట్ నటుడుగా ఒక్క అవార్డ్ కూడా రాలేదు. తనకు వచ్చిన అవార్డ్స్ అన్నీ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే నటుడిగా అవార్డ్ వస్తుండడంతో నాని మాత్రం బాగా హర్ట్ అయ్యినట్టు అనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి సైమా అవార్డ్ ఫంక్షన్ లో నాని కెరీర్ లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన “జెర్సీ” సినిమాకి కూడా నానికి బెస్ట్ ఆక్టర్ అవార్డ్ రాకపోవడంతో హర్ట్ అయ్యి మాట్లాడాడు.

నాకు ఎప్పుడూ బెస్ట్ ఎంటర్టైనర్ గానే అవార్డ్స్ వస్తున్నాయి. సంవత్సరానికి మూడేసి సినిమాలు చేసినా ఒక్కదానిలో కూడా నాకు బెస్ట్ ఆక్టర్ గా అవార్డ్ రాలేదు ఇక బహుశా లైఫ్ లో ఈ అవార్డ్ రాదేమో అంటూ నాని ఎమోషన్ అయ్యిపోయాడు. ఇది మాత్రం నిజంగా బాధాకరం అని చెప్పాలి. అలాంటి జెర్సీ సినిమాకే నానికి అవార్డ్ రాకపోతే ఇక వేరే ఏ సినిమాకి వస్తుందో.. ప్రస్తుతం అయితే నాని నటించిన లేటెస్ట్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్” లో కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు మరి ఇందులో ఎలాంటి నటనను కనబరుస్తాడో చూడాలి.