Shyam Singha Roy: ఓటీటీ లో వరల్డ్ వైడ్ రికార్డులను సృష్టిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా.?

Shyam Singha Roy: రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా ఇటీవలే విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 24న భారీ అంచనాల నడుమ విడుదలైన అయ్యింది. ఇక ఈ సినిమా ఇటీవలే విడుదలైంది మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవలే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. కరోనా సమయంలో థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రస్తుతం ఓటీటీ లో కూడా రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయిన మొదటి వారంలో ఇండియాలో ఆల్ టైం హైయెస్ట్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమాగా శ్యామ్ సింగరాయ్ సినిమా సంచలన రికార్డును సృష్టించింది. ఇక గత వారం అనగా జనవరి 21న వరల్డ్ వైడ్ గా విడుదలైన సినిమా నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేటగిరిలో అత్యధిక వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

ఈ సినిమాకు కరోనా సమయంలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్ రన్ లో 28 కోట్ల రూపాయలు వసూలు చేసి అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టింది. ఇకపోతే హీరో నాని విషయానికి వస్తే.. నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటించిన సుందరానికి అనే మరొక సినిమా షూటింగ్ ను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా యాక్షన్ డ్రామా లో నటిస్తున్నాడు నాని. ఇక ఇంతకు ముందు ఎన్నడూ చూడని పాత్రలో నాని కనిపించనున్నాడు అని సమాచారం.