టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరోనే. అవును.. మహేశ్, ఆయన భార్య నమ్రత ఇద్దరు కలిసి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంతో మందికి ఎన్నోసార్లు ఆర్థిక సాయం అందించారు. లక్షలు పోసి వైద్యం చేయించుకోలేని ఎంతో మంది పేదలకు ఆర్థిక సాయం చేశారు. అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు కూడా వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు.
తాజాగా… ఏపీకి చెందిన ఓ చిన్నారి డింపుల్ కు అరుదైన వ్యాధి సోకింది. దీంతో ఆ చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధి వచ్చింది. దానికి ట్రీట్ మెంట్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని.. ఆ చిన్నారికి, తన ఫ్యామిలీకి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈసందర్భంగా ట్వీట్ చేశారు. ఆ చిన్నారి ఫోటోను కూడా ట్వీట్ చేశారు నమ్రత.