Home News నమ్ర‌త బ‌ర్త్‌డే సెలబ్రేష‌న్స్‌.. వైర‌ల్‌గా మారిన పిక్స్

నమ్ర‌త బ‌ర్త్‌డే సెలబ్రేష‌న్స్‌.. వైర‌ల్‌గా మారిన పిక్స్

న‌టి, మిస్ ఇండియా, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ జ‌న‌వ‌రి 22న 49వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు అంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న‌, కీర్తి సురేష్‌, దేవి శ్రీ ప్రసాద్ లాంటి వారు న‌మ్ర‌త ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా అంద‌మైన ఫొటో షేర్ చేస్తూ.. ఈ రోజు నాకెంతో ప్ర‌త్యేకంగా మార‌నుంది. హ్యాపీ బ‌ర్త్‌డే లేడీ బాస్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి న‌మ్ర‌త థ్యాంక్యూ మై ల‌వ్ అని రిప్లై ఇచ్చింది.

Maa | Telugu Rajyam

అయినే న‌మ్ర‌త బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ కోసం మ‌హేష్ ఫ్యామిలీ అంతా దుబాయ్ వెళ్ళారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో వెళ్లొచ్చిన ఈ కుటుంబం రీసెంట్‌గా మ‌రోసారి దుబాయ్ చెక్కేశారు. న‌మ్ర‌త సోద‌రి శిల్ప శిరోడ్క‌ర్ దుబాయ్‌లోనే నివ‌సిస్తుండ‌గా, వారింటికి వెళ్ళారు. అక్క‌డే న‌మ్ర‌త బ‌ర్త్ డే వేడుకలు జ‌రిపారు. తాజాగా న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బ‌ర్త్‌డేకు సంబంధించి ఫొటోలు వీడియోలు షేర్ చేస్తూ ఈ బ‌ర్త్‌డే జీవితాంతం గుర్తుండిపోయేలా చేశారు. నా కుటుంబ స‌భ్యుల‌కు, బంధువ‌ల‌కు, స్నేహితుల‌కు కృత‌జ్ఞ‌త‌లు అని పేర్కొంది.

మ‌హేష్ ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట అనే చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా కోసం నెల రోజుల పాటు దుబాయ్‌లోనే ఉండ‌నున్నాడు. న‌మ్ర‌త త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకొని త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌కు రానుంది. మ‌హేష్ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌లో పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఇందుకోసం కీర్తి సురేష్ రీసెంట్‌గా దుబాయ్‌లో వాలింది. పాట త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల‌ను కూడా షూట్ చేయ‌నున్నారు. ప‌ర‌శురాం తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమా సామాజిక నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Related Posts

Related Posts

Latest News