Nallamala Movie: ప్రేక్షకులను ఆకట్టుకున్న నల్లమల ట్రైలర్… ముఖ్యఅతిథిగా దిల్ రాజు!

Nallamala Movie: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు చాలా తక్కువ అని.. ఇక కొత్త వాళ్లతో సినిమా తీస్తే ఇది సక్సెస్ చాలా తక్కువగా ఉంటుందని.. మనం ఎక్కడ విజయం సాధిస్తామో తెలుసుకుని సినిమాలు తీయాలని అందరికి చెబుతుంటానని.. స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనోజ్ తివారీ.. హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ నల్లమల’.  ఈసినిమా ట్రైలర్ లాంఛ్ కు ముఖ్య అతిథిగా వచ్చారు దిల్ రాజు. ‘ ఏమున్నవే పిల్ల ఏమున్నవే’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయిందని.. ఇది విధంగా సినిమా కూడా పెద్ద హిట్ కావాలని ఆయన కోరుకున్నారు. ఈసినిమా ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శనివారం నిర్వహించారు.

దర్మకుడు రవి చరణ్ మాట్లాడుతూ.. నిర్మాత దూరంగా ఉన్నా మాపై నమ్మకంతో సినిమా తీశారని అన్నారు. త్రివిక్రమ్ పాట బాగుందని.. సినిమా కూడా బాగా తీయాలని చెప్పారన్నారు. దేవకట్టా సినిమా టీజర్ సమయంలో అతిథిగా వచ్చి సినిమా బాగుందని మెచ్చుకున్నారని.. రాఘవేంద్రరావు, నాజర్ కూడా సినిమా బాగుందనన్నారని ఆయన రవిచరణ్ అన్నాడు.

మరోవైపు సినిమా హీరో అమిత్ తివారీ మాట్లాడుతూ… దిల్ రాజు బ్యానర్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశానని.. ఇప్పుడు హీరోగా వస్తున్న తొలి సినిమా ట్రైలర్ రిలీజ్ కు దిల్ రాజు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ విషయంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారని.. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్ అని చెపుకొచ్చింది హీరోయిన్ భాను శ్రీ.

YouTube video player

ఈ సినిమాలో హీరో అమిత్ తివారీ, హీరోయిన్ భానుశ్రతో పాటు త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఛలాకీ చంటి, శుభోద‌యం రాజ‌శేఖ‌ర్‌, చ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్కు అవినాష్‌, శేఖ‌ర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీ‌ను నటించారు.