10 కోట్ల నాగార్జున.. వెనక్కు వస్తాయా ?

Nagarjuna's wild Dog target is 10 crores

Nagarjuna's wild Dog target is 10 crores

కింగ్ నాగార్జునకు మంచి హిట్ పడి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో ‘సోగ్గాడే చిన్ని నాయన’తో మెప్పించిన ఆయన ఆ తర్వాత బాక్సాఫీస్ ముందు జోరు చూపలేదు. ‘ఆఫీసర్, దేవదాస్, మన్మథుడు 2’ సినిమాలన్నీ పోయాయి. దాంతో ఆయన మార్కెట్ స్థాయి కూడ డౌన్ అయింది. ఆయన సినిమాలు గతంలో పిలికిన ధర కంటే ఇప్పుడు తక్కువే పలుకుతున్నాయి. ఆయన కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’. ప్రభ్ సాలోమన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపే విడుదలకానుంది. సినిమా మీద మంచి అంచాలు ఉన్నాయి. నాగ్ సైతం ఈ సినిమా మీద బోలెడు నమ్మకాలు పెట్టుకున్నారు.

అయినా సినిమా హక్కులు తక్కువకే అమ్ముడయ్యాయి. నైజాం, సీడ్, ఆంధ్రాలో కలిపి 8.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సినిమా. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని ఇంకో కోటిన్నర చేసింది. అలా మొత్తం మీద 9 నుండి 9.5 కోట్ల వరకు హక్కులు అమ్ముడయ్యాయి. దీన్నిబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్ల నుండి 10 కోట్ల వరకు ఉంటుంది. నిజానికి ఇదేమీ పెద్ద మొత్తం కాదు. కానీ నాగ్ గత సినిమాలు పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం కొద్దిగా పెద్దదే అనాలి. ‘వైల్డ్ డాగ్’ తొలిరోజు యబో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా చాలు 10 కోట్ల షేర్ వచ్చేస్తుంది. అలా కాకుండా ‘ఆఫీసర్’ లాంటి రాక్ వస్తే మాత్రం నష్టాలు తప్పవు. మరి చూడాలి నాగ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో.