చిరంజీవి కోసం త్యాగం చేసిన నాగార్జున

చిరంజీవి, నాగార్జున ఇద్దరూ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో లు గా వెలుగొందిన వీళ్ళిద్దరూ తమ మధ్య పోటీ ఉన్నా కానీ…ఎప్పుడూ కలిసి, మెలిసి ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా వీళ్ళ స్నేహం అలాగే ఉంది. తరచూ సినిమా ఫంక్షన్స్ లో నాగార్జున, చిరంజీవి కలిసి కనిపిస్తారు.

అయితే ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య సినిమా రిలీజ్ విషయం లో పోటీ మరోసారి వచ్చింది. ఈ మధ్య కాలం లో సినిమా బ్లాక్ బస్టర్ అంటేనే కానీ జనాలు థియేటర్ కి రావట్లేదు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలయిన చిరంజీవి ‘ఆచార్య’ సినిమా వారంలోనే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. అలాగే నాగార్జున కూడా హిట్ కొట్టి చాలా రోజులైంది.

ఈ ఇద్దరి సూపర్ స్టార్స్ ఇప్పుడు దసరా కి తమ సినిమాలతో రెడీ గా ఉన్నారు. అక్టోబర్ 5 న చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ఘోస్ట్’ సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే కలెక్షన్స్ దెబ్బ తింటాయని చిరంజీవి నాగార్జున కి ఫోన్ చేసి ‘ఘోస్ట్’ సినిమా రిలీజ్ పోస్టుపోన్ చేసుకోమన్నాడని తెలుస్తుంది.

ఫ్రెండ్షిప్ కి వేల్యూ ఇచ్చే నాగార్జున తన సినిమాను రెండు రోజులు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. మళళయాళం సినిమా ‘లూసిఫెర్’ కి రీమేక్ గా వస్తుంది ‘గాడ్ ఫాదర్’. నాగార్జున ‘ఘోస్ట్’ సినిమా ఒక ఆక్షన్ ఎంటర్టైనర్.