Home News అక్కడైతే నా ఇష్టం అంటున్న నాగార్జున

అక్కడైతే నా ఇష్టం అంటున్న నాగార్జున

Nagarjuna To Do Experiments In Ott
ఓటీటీల జోరు బాగా పెరిగింది. సినిమా హాళ్లు తెరుచుకోకపోకడం, సినీ ప్రేక్షకులు డిజిటల్ మాధ్యమాలకు బాగా అలవాటు పడటంతో నటీనటులు ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు.  స్టార్ హీరోలు సైతం ఓటీటీల్లో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు.  ఇప్పటికే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన నారప్ప చిత్రాన్ని ఓటీటీలోకి వదలాలని డిసైడ్ చేసుకోగా ఇప్పుడు మరొక సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం ఓటీటీలో అడుగుపెట్టిడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు.  అయితే నాగార్జున ఓటీటీ వైపుకు రావడానికి బలమైన రీజనే ఉంది.  అదే ప్రయోగాలు.  స్టార్ హీరోలు చాలామంది తమ ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి వెనుకాడతారు. 
 
అందుకు కారణం అవి థియేటర్లలో వర్కవుట్ కాకపోతే దెబ్బతినాల్సి ఉంటుంది. అందుకే కొన్ని డిఫరెంట్ కథలు నచ్చినా, చేయాలనే కోరిక ఉన్నా బలవంతంగా వాటిని పక్కనపెట్టేస్తుంటారు.  నాగార్జున కూడ అంతే.  పలు ఎక్స్పరిమెంటల్ సబ్జెక్ట్స్ పక్కనపెట్టేశారు.  కానీ ఇప్పుడు ఓటీటీ మీడియం రావడంతో అక్కడైతే ప్రయోగాలకు మంచి వేదిక ఉన్నట్టు ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవలే ఆయన వద్దకు ఒక కథ వచ్చిందట. అది పూర్తిగా డిఫరెంట్ అండ్ ఎక్స్పరిమెంటల్. అది ఓటీటీకి బాగా సరిపోతుందట.  అందుకే ఆయన ఓటీటీలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  ప్రస్తుతం స్టోరీ మీద వర్క్ జరుగుతోందని, అది పూర్తికావడానికి కాస్త సమయం పడుతుందని అంటున్నారు.  మొత్తానికి నాగ్ కొత్త అడుగు వేయబోతున్నారు.  ఇకపోతే ఆయన ప్రస్తుతం ప్రవీణ్ సత్తారుతో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు.  
 
 

Related Posts

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

బద్వేలు ఉప ఎన్నిక: వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ వుందా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ేడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (వైసీపీ)...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News