నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా!

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పై నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. అక్కినేని హీరోలైన అఖిల్, నాగ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరై అలరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌తో పాటు టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెరిగెలా చేసాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత నాగార్జునకు సరైన విజయం లేదు.

ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘ది ఘోస్ట్’ మూవీలో నాగార్జున ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ లో నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్‌గా కనిపించారు.

తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది కూడా పూర్తి యాక్షన్ ప్యాక్డ్‌‌గా ఉంది. ఈ వయసులో కూడా నాగ్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. యువ సంగీత దర్శకులు భరత్ – సౌరభ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ గ్లింప్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళింది.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం నాగార్జునతో పాటు హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఎంతో కష్టపడింది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎలెల్పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమపార్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్, మనీష్ చౌదరి, జయప్రకాశ్, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ, బిలాల్ హుస్సేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

శత్రువులను ఘోస్ట్ రూపంలో అంతమొందించే పాత్రలో నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అంతేకాదు పేరు కోసమే కాదు.. ఎంతో మంది దేశం కోసం అజ్ఞాతంగా పనిచేస్తున్నారు. వారందరినీ ఉద్దేశించి ‘ఘోస్ట్’ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక అక్టోబర్ ఐదు న ప్రేక్షకుల ముందు ఎలా అలరిస్తుందో తెలియాలంటే థియేటర్ కు వెళ్లి చూడాల్సిందే.