నాగార్జున మహేష్ బాబు ముల్టీస్టార్రర్?

ప్రస్తుతం టాలీవుడ్ ముల్టీస్టార్రర్ ట్రెండ్ మళ్ళీ మొదలైంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తెలుగు లో ఈ మద్య తరచూ ముల్టీస్టార్రర్ సినిమాల్లో కనిపిస్తున్నది మాత్రం వెంకటేష్.

వరుస హిట్స్ లో మంచి ఊపు మీద ఉన్న మహేష్ బాబు వెంకటేష్ తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు.తర్వాత కూడా మంచి కథ వస్తే ఏ హీరోతో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధం అని మహేష్ బాబు అన్నాడు. ‘ఆచార్య’ సినిమాలో మొదట్లో రామ్ చరణ్ రోల్ కోసం మహేష్ బాబు ని సంప్రదించారు, కానీ ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు.

అప్పులతో మణిరత్నం సినిమాలో నాగార్జున, మహేష్ బాబు కలిసి నటించే అవకాశం వచ్చింది, కానీ ఆ సినిమా షూట్ మొదలవకుండానే ఆగిపోయింది. తాజాగా ‘ది ఘోస్ట్’ సినెమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున కి ఇదే ప్రశ్న ఎదురైంది. తాను మహేష్ ఎప్పుడంటే అప్పుడు ముల్టీస్టార్రర్ చెయ్యడానికి రెడీ అన్నాడు. మరి చూడాలి, నాగార్జున, మహేష్ బాబు ముల్టీస్టార్రర్ సినిమా ఫ్యూచర్ లో ఉంటుందో లేదో.