అక్కినేని ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్స్ ఇచ్చిన నాగార్జున.!

ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు సాలిడ్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో అక్కినేని ఫామిలీ నుంచి వస్తున్న సినిమా కూడా ఒకటి. కింగ్ నాగార్జున మరియు అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబోలో తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇది. అదే “బంగార్రాజు”. అక్కినేని ఫ్యాన్స్ లో ఎంతో ఇష్టపడే సినిమాల్లో ఒకటైన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమా కూడా ఒకటి.

దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్ తోనే దర్శకుడు ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించాడు. మరి దీనిపైనే నాగార్జున ఇప్పుడు సాలిడ్ అప్డేట్స్ రెండు ఇచ్చారు. మొదటగా సినిమా ఫస్ట్ లుక్ ని ఈ 22న సాయంత్రం 5:22 కి రిలీజ్ చేస్తుండగా అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ ని తర్వాత రోజు 23న ఉదయం 10:23 కి లాంచ్ చెయ్యనున్నారట. ఇక ఈ టీజర్ లో బంగార్రాజు ఎంత సందడి చేస్తాడో చూడాలి.