Nagarjuna : బిగ్ న్యూస్ : చై – సామ్ విడాకుల విషయంపై నాగ్ ఫస్ట్ టైం ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Nagarjuna :  గత కొన్నాళ్ల కితమే స్టార్ అండ్ చాలా మంది ఎంతో ఇష్టపడే స్టార్ జంటలలో అక్కినేని నాగ చైతన్య మరియు సమంతల పెయిర్ కూడా ఒకటి. ప్రేమించి పెద్దలని ఒప్పించి మరీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న వీరు ఎందుకో తెలీదు కానీ వారి వివాహ బంధం నుంచి విడిపోయారు.

దీనితో ఈ వార్త పెద్ద ఎత్తునే కలకలం రేపింది. అంతకు ముందు ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సమంతాకి కూడా ఎన్నో ప్రశ్నలు వేదించాయి.. ఇక ఎలాగో వాటి అన్నిటినీ అధిగమించి ఆమె తన పని తానూ చేసుకుంటుంది. అలానే ఇంకో పక్క చైతు కూడా బిజీగా ఉన్నాడు.

మరి ఇదిలా ఉండగా ఫైనల్ గా అక్కినేని నాగార్జున వీరి విడాకులు వాటిపై ప్రచురించబడ్డ వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చెయ్యడం వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారి విడాకులపై ఎవరెవరో ఏవేవో రాసారు న్యూస్ ఛానెల్స్ లో కూడా ప్రసారం చేసిన వార్తలు చాలా బాధించాయని అందుకే అలాంటి రాతలపై ఎప్పుడూ కూడా స్పందించలేదు అని తెలిపారు.

అలాగే చైతూ అయితే ఇలాంటివి అన్నీ అసలు పట్టించేకోడని నాగ్ సెలవిచ్చాడు. ఇపుడు అయితే ఇద్దరూ కూడా ఎవరి పనుల్లో వారున్నారు అంతే చాలని నాగ్ మొదటి సారిగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీనితో ఇవి ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.