Nagababu Escapes : అంతా నా ఇష్టం అనే నాగబాబు ఆ విషయంలో మాత్రం కాస్త తడబడుతున్నారు. ఇంతకీ ఏంటా విషయం.? కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి విషయం. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ పెళ్లి ఓ హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్‌గా మారింది.
అందుకు కారణం వరుణ్ తేజ్ ఓ హీరోయిన్‌తో లవ్‌లో వున్నాడన్న అనుమానాలే. ఆ హీరోయిన్ మరెవరో కాదు. లావణ్య త్రిపాఠి. ఇంటి ఫంక్షన్లలోనూ, ఔట్ డోర్ విహార యాత్రల్లోనూ ఈ జంట ఫుల్ బిజీగా వుందంటూ ఒకింత అటెన్షన్ క్రియేట్ అయ్యింది వీరిద్దరి మీదా.
అంతేగా, వైరల్ న్యూస్‌కున్న క్రేజే వేరు మరి. అలా వైరల్ అయిన ఈ జంట గురించి, ఎప్పుడు ఛాన్స్ దొరికినా నాగబాబు ముందుకు ఓ ప్రశ్న రెడీ అయిపోతోంది మీడియా జనాల నుంచి. ఆ ప్రశ్నకు పదే పదే సమాధానం చెప్పలేక నాగబాబు తాజాగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట.
ఇంకెప్పుడూ ఈ ప్రశ్న నా వద్దకు తీసుకురావద్దనీ, ఏ విషయమైనా ఆన్సర్ చెబుతాను కానీ, ఈ ప్రశ్నకు నా దగ్గర ఆన్సర్ లేదనేశాడట. అంతేకాదు, డైరెక్టుగా ఈ క్వశ్చన్ వరుణ్ తేజ్‌నే అడగండి.. అంటూ కంప్లీట్‌గా ఎస్కేప్ అయిపోయాడట కూడా. పెద్ద బాబు గారు ఎస్కేప్ అయ్యారు సరే, వరుణ్ బాబుని అడ్డంగా బుక్ చేసేశాడుగా నాగబాబు.