నేను సినిమాలు చేస్తేనే వెబ్ సైట్స్ నడుస్తాయి…. దమ్ముంటే నా సినిమా ఆపండి: నాగ వంశీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సూర్యదేవరనాగ వంశీ (Naga Vanshi)ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఈయన స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. చిన్న సినిమాలను నిర్మించడమే కాకుండా కొత్త వారిని కూడా ప్రోత్సహిస్తూ నాగ వంశీ ప్రస్తుతం ఎంతో బిజీగా ఇండస్ట్రీలో గడుపుతున్నారు. తాజాగా ఈయన బ్యానర్ నుంచి మ్యాడ్ స్క్వేర్(Mad Squares) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా మార్చ్ 28వ తేదీ విడుదల అయ్యి మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కొంతమంది రివ్యూవర్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్న తీరుపై నాగ వంశీ పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈయన ఓ కార్యక్రమంలో ఇదే విషయంపై మాట్లాడుతూ సోషల్ మీడియాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.కంటెంట్ లేకపోయినా కూడా కొన్ని సినిమాలు సీక్వెల్ కాబట్టి ఆడుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరైనది కాదనీ తెలిపారు.

సినిమా ఎలా ఉన్నా చూడటానికి ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎవరు నటించలేదు.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాలకు సీక్వెల్ చిత్రం కాదు.మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని థియేటర్లలో చాలాసార్లు చూశాము కాబట్టే ప్రేక్షకుల స్పందన బాగుంది ఆడియన్స్ తెలిసినంతగా రివ్యూలకు సరిగ్గా తెలియదేమో అంటూ మాట్లాడారు. నా మీద పగ ఉంటే దమ్ము ఉంటే నా చిత్రాలను బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయండి.. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్ సైట్స్ రన్ అవుతున్నాయి. నేను ప్రెస్ మీట్ పెడితేనే మీ యూట్యూబ్ ఛానల్ కు కంటెంట్ దొరుకుతుంది. అలాంటప్పుడు మంచిగా ఆడుతున్న సినిమాల గురించి నెగిటివ్గా ఎందుకు రాస్తున్నారు దయచేసి సినిమాలను చంపేయొద్దండి అంటూ ఈయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.