Ram Charan: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ చివరగా గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ అభిమానుల ఆశలన్నీ కూడా తదుపరి సినిమాలపైనే ఉన్నాయి. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే రామ్ చరణ్ తదుపరి సినిమాలకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది దర్శకుల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్స్ లిస్ట్‌లోకి ఇప్పుడు ఒక బాలీవుడ్ డైరెక్టర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు ప్రేక్షకులు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు డైరెక్టర్ నిఖిల్ నగేశ్ భట్. వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్‌లో కిల్ లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసిన నిఖిల్ నగేశ్ భట్, రామ్ చరణ్ కోసం అదిరిపోయే స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది.
అయితే రామ్ చరణ్,నిఖిల్ నగేశ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే న్యూస్ ఇప్పటిది కాదు. చాలా కాలంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతూనే ఉంది. అయినా దీనిపై ఎవరూ ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ తో రామ్ చరణ్ సినిమా లేదని కన్ఫర్మేషన్ రావడంతో చరణ్,నిఖిల్ నగేశ్ ప్రాజెక్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో పెద్ది సినిమా తెరకెక్కుతోంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత చరణ్ లైనప్‌లో డైరెక్టర్ సుకుమార్ ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాపై అల్రెడీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది.