ఆర్మీలో చేరబోతున్న నాగ చైతన్య

Naga Chaitanya will be seen as soldier

Naga Chaitanya will be seen as soldier

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చేస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రంలో నాగ చైతన్య ఒక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ పాత్రకు విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సేతుపతి పక్కకు తప్పుకోవడంతో అతని స్థానంలోకి నాగ చైతన్య వచ్చి చేరాడు. నిజానికి చైతన్యకు బాలీవుడ్లో ఇదే మొదటి సినిమా. ఇదే అతనికి బాలీవుడ్ ఎంట్రీ అనుకోవచ్చు. ఇందులో చైతన్యది చిన్న పాత్రేమీ కాదు. ఎక్కువ నిడివి ఉన్న క్యారెక్టరే.

ప్రస్తుతం చైతూ ‘థాంక్యూ’ షూట్ కోసం అవుట్ డోర్లో ఉన్నాడు. అక్కడి నుండి రాగానే అమీర్ ఖాన్ సినిమాలో జాయిన్ అవుతారు. సుమారు 45 రోజులపాటు చైతన్య షూటింగ్లో పాల్గొననున్నాడు. ఇందులో చైతన్య సోల్జర్ పాత్రలో కనిపిస్తాడు. చిత్రంలో ఆర్మీ ఎపిసోడ్ సుమారు 40 నిముషాల వరకు ఉంటుంది. అందులో ఒక వార్ ఎపిసోడ్ కూడ ఉంటుంది. వీటిలో చైతన్య ఆమిర్ ఖాన్ స్నేహితుడిగా కీలకంగా కనిపిస్తాడు. ఆమిర్ ఖాన్, చైతూల నడుమ మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. మొత్తానికి చైతన్యకు ఆమిర్ ఖాన్ హిందీలో మంచి ప్రారంభాన్ని ఇస్తున్నారు.