Naga Chaitanya : ఇండస్ట్రీ టాక్ : అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేసిన నాగ చైతన్య.. వివరాలు ఇవే.!

Naga Chaitanya : మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరోల్లో అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటడ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకడు. అవ్వడానికి పెద్ద ఫ్యామిలీ హీరో అయినా నటుడుగా మాత్రం తన పరిణితి చాలా పెంచుకొంటూ మంచి హీరోగా ఎదిగాడు. ఇక లేటెస్ట్ గా అయితే “బంగార్రాజు”, “లవ్ స్టోరీ” చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ఇప్పుడు మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.

మరి ఇండస్ట్రీ వర్గాల నుంచి అయితే ఒక క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తోంది. ఇంతకీ ఆ కాంబినేషన్ ఏమిటంటే అక్కినేని నాగ చైతన్య మరియు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్” దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో ప్లాన్ చేస్తున్నాడట. మరి అలాగే దీనితో పాటుగా ఈ సినిమాని మన టాలీవుడ్ ప్రముఖ భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెరకెక్కించనున్నారని వినికిడి.

ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే చైతూ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో ఓ సినిమా దాని తర్వాత ఒక హారర్ సిరీస్ లు చేస్తున్నాడు