Yem Maaya Chesave: వెండితెరపై సందడికి సిద్ధమైన సమంత చైతూ… ఇది అసలు ఊహించలేదుగా?

Yem Maaya Chesave: టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే లాగా ఉన్నటువంటి వారిలో సమంత నాగచైతన్య జంట ఒకటని చెప్పాలి వీరద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే ఎంతో సంతోషంగా జీవితంలో ఎన్నో ఆశలతో ముందుకు వెళుతున్న సమంత నాగచైతన్య జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో చివరికి విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత నాగచైతన్య తిరిగి శోభితను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత వీరిద్దరు కలిసి ఇలాంటి సినిమాలలో నటించలేదు ఇకపై నటించరని కూడా తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా సమంత నాగచైతన్య వెండితెరపై మరోసారి సందడి చేయటానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

ఇలా వెండితెరపై సమంత నాగచైతన్య సందడి చేయబోతున్నారు అంటే కొత్త సినిమా కాదండోయ్ వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా సమయంలోనే సమంత నాగచైతన్య ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలా ఇద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇద్దరికీ చాలా ప్రత్యేకమనే చెప్పాలి అయితే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఈ సినిమాను తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా జూలై 18వ తేదీ విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ఇలా సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత వీరి సూపర్ హిట్ సినిమా విడుదల కాబోతుందని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.