“థాంక్ యూ” టీజర్ టాక్.. సినిమాపై నమ్మకం పెట్టుకోవచ్చా.??

Thankyou Teaser : అక్కినేని వారి యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ సినిమాల్లో తమ ఫ్యామిలీ హిట్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “థాంక్ యూ” ఎప్పుడు నుంచో మంచి అంచనాలు నెలకొల్పుకోని ఉన్న ఈ సినిమా రిలీజ్ కి దగ్గర అవుతున్న వేళ మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా టీజర్ కట్ ని రిలీజ్ చేశారు.

అయితే ఇది మంచి ఆసక్తి గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా నాగ చైతన్య లోని కనిపిస్తున్న షేడ్స్ చాలా బాగున్నాయి. అలాగే దర్శకుడు విక్రమ్ ఎంచుకున్న నేపథ్యం కూడా మంచి ఫ్రెష్ గా కనిపిస్తుంది. చైతూ సక్సెస్ ఫుల్ అయినటువంటి బిజినెస్ మెన్ గా కనిపించాడు అలాగే అగ్రెసివ్ యువకుడిగా ఒక ప్లే బాయ్ గా కనిపించి అదరగొట్టాడు.

Thank You Teaser | Naga Chaitanya, Raashi Khanna | Thaman S | Vikram K Kumar | Dil Raju

 

ఇంకా అవికా గోర్ అనుపమ, రాశి ఖన్నా ఇలా  యంగ్ హీరోయిన్ లు సుపర్బ్ కెమిస్ట్రీ కనబరిచారు. అయితే తను ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా తన లోని కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేని రోల్ లో కనిపిస్తున్నాడు చైతూ దాన్ని అధిగమించి ఎలా రియల్ సక్సెస్ అందుకున్నాడు అనేది ఈ టీజర్ చూసాక తెలుస్తోంది.

ఇక ఈ టీజర్ లో థమన్ ఇచ్చిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మొత్తంగా అయితే ఈ టీజర్ సింపుల్ అండ్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మరి సినిమా కోసం అయితే జూలై 8 వరకు ఆగాల్సిందే.