Samantha -Nagachaitanta: సమంత నాగచైతన్య వృత్తిపరమైన వ్యక్తిగత జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది అని చెప్పాలి. వీరిద్దరి సిరి ప్రయాణం ఎలా మొదలైంది సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారు వ్యక్తిగత జీవితంలో వీరిద్దరూ ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఏం మాయ చేసావే సినిమాతో వెండితెరపై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ జంట అనంతరం నిజజీవితంలో కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాలవల్ల వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.
ప్రస్తుతం నాగచైతన్య మరొక నటి శోభితను వివాహం చేసుకున్నారు. ఇక నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం మయోసైటిసిస్ అనే వ్యాధికి గురి కావడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సమంత నాగచైతన్యకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
వీరిద్దరూ కలిసి నటించిన మనం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా lనే నాగచైతన్య సమంతకు ఐ లవ్ యు చెప్పారు.. అయితే సమంత మాత్రం ఏదో చెప్పాలని చెప్పడం కాదు ఫీల్ అవుతూ చెప్పు అంటూ నాగ చైతన్యకు చెప్పడంతో మరోసారి చైతన్య నిజంగానే లవ్ ఫీల్ అవుతూ ఆమెకు ప్రపోజ్ చేశారు. అయితే ఈ సమయంలో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వీరి ప్రేమ విషయం బయటకు తెలియకపోవటం విశేషం. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారడంతో అప్పట్లో నిజంగానే లవ్ ఫీల్ అయ్యి నాగచైతన్య ప్రపోజ్ చేశారే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎంతో సంతోషంగా ఉన్న వీరిద్దరి జీవితంలో భేదాభిప్రాయాలు రావడంతోనే విడాకులు తీసుకున్నారని స్పష్టమవుతుంది అయితే విడాకులకు గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియ రాలేదు.

