Naga Shaurya In For Samantha : ‘ఓ బేబీ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి, ఆ తర్వాత సమంతతో ఇంకో సినిమాకీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిగో అదిగో.. అంటూ ఆ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తోంది.
కాగా, ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై స్పీడ్ పెంచే దిశగా నందినీ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. అయితే, ఇక్కడే ఓ చిన్న చిక్కొచ్చి పడింది. నందినీ రెడ్డి అప్పట్లో ఈ సినిమా కోసం నాగ చైతన్యను, సమంతను ఎంగేజ్ చేసింది.
కానీ చైతూ సమంత మధ్య విడాకులకు ముందు, విడాకులు తర్వాత అనే సిట్యువేషన్ ఏర్పడింది. సో, నందినీ రెడ్డి ఏం చేయబోతోంది.? మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్‌ని మార్చేశారట.. అంటూ వార్తలొచ్చాయ్. కానీ, సమంత ప్లేస్ అలాగే వుందట.
తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి హీరో నాగచైతన్య తప్పుకున్నాడంటూ వార్తలొస్తున్నాయ్. ఆ ప్లేస్‌ని మరో యంగ్ హీరో నాగశౌర్య రీప్లేస్ చేశాడనీ అంటున్నారు. అంటే, పక్కాగా ఇది ‘ఓ బేబీ’ కాంబినేషన్ అన్నమాట.
అయితే, నందినీ రెడ్డి దృష్టిలోంచి నాగ చైతన్య ఎస్కేప్ కావట్లేదట. కథ ప్రకారం చైతూ అయితేనే బాగుంటుందని భావిస్తోందట. ఈ నేపథ్యంలో చైతూని, సమంతను ఒప్పించడానికి నందినీ రెడ్డి ప్రయత్నిస్తోందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న తాజా సమాచారం.
సినిమాలు వేరు, పర్సనల్ లైఫ్ వేరు అనే కోణంలో స్క్రీన్ కోసం మళ్లీ సమంత, నాగ చైతన్య కలుస్తారా.? అన్నట్టు ‘మజిలీ’ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలోనూ చైతూ, సమంత ఓ లవ్ స్టోరీ చేయాల్సి వుంది.
ఒకవేళ నందినీ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తే, ఈ ప్రాజెక్టు పైనా ఓ క్లారిటీ వచ్చినట్లే.