Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఎప్పుడైతే సమంతకు విడాకులు ఇచ్చి తిరిగి శోభితను పెళ్లి చేసుకున్నారో అప్పటినుంచి తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల నాగచైతన్య తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమానాగచైతన్య సినీ కెరియర్ లోనే అత్యంత భారీ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా గతంలో నాగచైతన్యకు సంబంధించిన ఒక పాత వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన రానా హోస్ట్ వ్యవహరించిన కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈయన సమంత కలిసే ఉన్నారు ఇంకా విడాకులు తీసుకోలేదు.
ఈ క్రమంలోనే రానా నాగచైతన్యను ప్రశ్నిస్తూ తొలిముద్దు అనుభవం గురించి అడిగారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ నా జీవితంలో తొలిముద్దు ఎప్పటికీ స్పెషల్ అని జీవితాంతం ఆ ముద్దు గుర్తుండి పోతుందని తెలిపారు . అయితే తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలోనే తాను ఒక అమ్మాయికి తొలిముద్దు ఇచ్చినట్టు చైతూ గుర్తు చేసుకున్నారు.
ఇకపోతే సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అభిమాని తనతో ఓ విషయం చెబుతూ మీరు సమంతకంటే కూడా చాలా తెల్లగా ఉన్నారు అంటూ చెప్పినట్లు నాగచైతన్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా ఈ షో సమయంలో వీరిద్దరూ కలిసి ఉన్నారు అయితే 2021 సంవత్సరంలో వీరిద్దరూ వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ తరచూ వీరికి సంబంధించి ఎన్నో పాత వీడియోలు, పాత విషయాలను కూడా వైరల్ చేస్తూ ఉన్నారు.