Naga Chaitanya : షాకింగ్ : ఓటిటిలో డైరెక్ట్ గా నాగ చైతన్య సినిమా..దీనిపై క్లారిటీ.!

Naga Chaitanya : అక్కినేని వారి యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన “థ్యాంక్ యు ది మూవీ” కూడా ఒకటి. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ చిత్ర బృందం షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు.

అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఈ సినిమాపై కొన్ని గాసిప్స్ గుప్పుమన్నాయి. ఈ చిత్రం రిలీజ్ పట్ల మేకర్స్ కి ఇంకా క్లారిటీ లేదు అని పోటీ కూడా ఎక్కువే ఉండడంతో ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అవుతుందని రూమర్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ భారీ ధరకి డీల్ సెట్టయ్యింది అని కూడా టాక్ రాగా దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజు సంస్థ ఒక క్లారిటీ ఇచ్చింది.

సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. చాలా డెడికేషన్ తో ఈ సినిమాని కేవలం థియేటర్స్ లో చూడడానికే రెడీ చేశామని, అందుచేత సరైన సమయం చూసి థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఆ గాసిప్స్ పై ఓ సాలిడ్ సమాధానం ఇచ్చారు.