నెపోటిజంపై  షాకింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య

సినిమా ఇండస్ట్రీ లో నెపోటిజం అనేది ఎప్పటినుండో ఉంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ నెపోటిజం ని సపోర్ట్ చేస్తూ ఎలాంటి బాక్గ్రౌండ్ లేని వాళ్ళని తొక్కేస్తున్నాడంటూ అతన్ని క్రిటిసిజ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానికి కారణం కూడా నెపోటిజం అంటూ కొందరు విమర్శలు చేసారు.

తాజాగా టాలీవుడ్ హీరో నాగ చైతన్య నెపోటిజం పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య ఇండస్ట్రీలో నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో కంటే సౌత్ లో నెపోటిజం ప్రభావం తక్కువ అని అన్నారు. అసలు దీని గురించి ఎందుకు పదే పదే చర్చ జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని నాగ చైతన్య తెలిపారు. నెపోటిజం వల్ల తనకు అవకాశాలు వచ్చిన మాట వాస్తవమే అని చైతు అన్నారు. కానీ ఇందులో తప్పు పట్టాల్సిన అంశం ఏముందో అర్థం కావడం లేదు.

మా తాత నాగేశ్వర రావుగారు నటులు.. మా నాన్నగారు కూడా నటులే. చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగాను. వారి ప్రభావం నాపై తప్పకుండా ఉంటుంది. వారి స్పూర్తితో నేను కూడా యాక్టర్ కావాలని ఆశపడ్డాను. వారు ఇండస్ట్రీలో నాకంటూ ఒక దారి చూపించారు. ఆ దారిలో పయనిస్తున్నాను.

ఒక వేల నేను నటించిన సినిమా.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో సినిమా ఒకే రోజు విడుదలయ్యాయి అనుకుందాం. నా సినిమా 10 కోట్లు సాధించి.. అతడి సినిమా 100 కోట్లు రాబడితే.. దర్శక నిర్మాతలు అతడి వద్దకే వెళతారు. నెపోటిజం వల్ల అవకాశాలు సులభంగా రావచ్చేమో కానీ చివరగా ఆడియన్స్ చూసేది కంటెంట్ మాత్రమే అని నాగ చైతన్య అన్నారు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఓ హీరో రాణిస్తే.. ఫ్యూచర్ లో అతడి కొడుకు హీరో కాకుండా అడ్డుకుంటారా అని నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్ చేశారు. నెపోటిజం పక్కన పెడితే ఇండస్ట్రీలో పోటీ సమానంగా ఉంటుంది అని నాగ చైతన్య అన్నారు. ఏ హీరో నటించిన సినిమా అయినా కంటెంట్ బలంగా ఉంటేనే విజయం సాధిస్తారు. బాక్సాఫీస్ వద్ద అందరూ సమానమే అని నాగ చైతన్య అన్నారు

ఈ మధ్య రిలీజ్ అయిన నాగ చైతన్య ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. ఇప్పుడు నాగ చైతన్య ఫోకస్ అంత తన నెక్స్ట్ మూవీస్ మీద పెట్టాడు.