Naga Chaitanya: వ్యాపారం లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య.. బావ అంటూ విష్ చేసిన వెంకటేష్ కూతురు..?

Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇక నాగచైతన్య ఇటీవలే బంగార్రాజు, లవ్ స్టోరీ సినిమాలతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. సమంత కు విడాకులు ఇచ్చిన తరువాత నాగ చైతన్య కెరీర్ పరంగా, ఇటు పర్సనల్ లైఫ్ లో చాలా మార్పు కనిపిస్తుంది. నాగచైతన్య ఇదివరకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండే వారు కాదు.

 

కానీ ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆ సినిమాలకు సంబంధించిన విషయాలను, అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగ చైతన్య కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. షో యూ పేరుతో హైదరాబాదులో ఒక సరికొత్త రెస్టారెంట్ ని ఓపెన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని నాగచైతన్య తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇక ఈ వీడియో పై వెంకటేష్ కూతురు ఆశ్రిత రిప్లై ఇస్తూ ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావ అంటూ విష్ చేసింది.