ఓహో ఇలా కూడా ప్లాన్ చేశారా.. ఆహా అనిపించేలా చైసామ్

సమంత క్రేజ్‌ను ఆహా యాప్ ఇప్పటికే ఓ రేంజ్‌లో వాడేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సమంత జంటను కూడా ఆహా వారు లాగేశారు. ఆహా యాప్‌లో సమంత సామ్ జామ్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే ఏడు ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. ఇందులో విజయ్ దేవరకొండ, రానా, రకుల్, తమన్నా వంటి వారంతా సందడి చేశారు. క్రిస్మస్‌కు చిరంజీవి, న్యూ ఇయర్ స్పెషల్‌గా అల్లు అర్జున్ ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు.

Naga Chaiatnya In Samantha Sam Jam
Naga Chaiatnya In Samantha Sam Jam

ఇందులో చిరు, బన్నీల ఎపిసోడ్ మాత్రం గ్రాండ్‌గా సక్సెస్ అయింది. అన్నింటి కంటే ఎక్కువగా చిరంజీవితో సమంత పెట్టిన ముచ్చట్లు బాగానే క్లిక్ అయ్యాయి. అయితే సమంత, నాగ చైతన్య జంటకు బయట ఉండే ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. అందుకు ఈ ఇద్దరిని పెట్టే యాడ్స్ చేస్తుంటారు.. అవి జనాల్లోకి ఈజీగా వెళ్లిపోతుంటాయి. అందుకే ఆహా వారు కూడా ఆ పాయింట్‌ను పట్టుకున్నారు.

అందుకే నాగ చైతన్యను కూడా సామ్ జామ్ షో కోసం తీసుకొచ్చారు. ఇక సమంత నాగ చైతన్యలు భార్యభర్తలుగా ముచ్చట్లు పెడతారా? లేదా? ప్రొఫెషన్‌ల్‌గా మాట్లాడుకుంటారా? అన్నది చూడాలి. మొత్తానికి ఏది ఏమైనా ఇది మాత్రం అన్ని ఎపిసోడ్‌లకంటే హైలెట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఇద్దరికి సంబంధించిన సామ్ జామ్ ఫోటోలే ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటే ఎపిసోడ్ ఇంకే రేంజ్‌లో ఉంటుందో.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles