ఓటిటి : దుమ్ము లేపుతున్న నాగ్ లేటెస్ట్ సినిమా.!

రీసెంట్ గా దసరా కానుకగా టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అక్కినేని నాగార్జున హీరోగా గ్లామరస్ హీరోయిన్ సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ ఏక్షన్ చిత్రం ది ఘోస్ట్ కూడా కూడా ఒకటి. అయితే ఈ సినిమాపై అయితే నాగ్ కెరీర్ లో ఏ సినిమాకి లేని విధమైన అంచనాలు నెలకొన్నాయి.

అదే ఊపులో సినిమాకి మంచి ఓపెనింగ్స్ కూడా దక్కాయి. కానీ సీన్ కట్ చేస్తే సినిమా కి లాభాలు మాత్రం నమోదు కాలేదు. అయితే దీనితో డిజాస్టర్ గానే మిగిలిన ఈ చిత్రం ఈ నవంబర్ 2న అయితే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.

మరి ఇందులో అయితే ఈ చిత్రం దుమ్ము లేపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చిన ఒక్క రోజులోనే ఇండియన్ వైడ్ టాప్ పోజిషిన్ లోకి వచ్చేసి నెంబర్ 1 చిత్రంగా ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది.

మరి దీనితో అయితే ఈ రెస్పాన్స్ చూసి నాగ్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఆ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక ఈ చిత్రానికి అయితే టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ వహించగా మార్క్ కె రాబిన్ అయితే సంగీతం అందించాడు.