బాత్‌రూంలో ఫొటో షూట్.. ప్యాంట్ మ‌ర‌చిపోయావా అంటూ కామెంట్

ఈ కాలం నాటి అందాల భామ‌లు అంద‌రు గ్లామ‌ర్ షోతో హీటెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పొట్టి పొట్టి దుస్తుల‌లో అందాల ఆర‌బోస్తూ వీరు చేస్తున్న ర‌చ్చ‌కు కుర్ర‌కారు కంటిపై కునుకు కూడా లేకుండా పోతుంది. ఒక వైపు హీరోయిన్స్ అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ‌చేస్తుంటే మ‌రో వైపు యాంక‌ర‌మ్మ లు కూడా అగ్గిరాజేస్తున్నారు. వీరి అందచందాలతో సోషల్ మీడియా రోజురోజుకూ మరింత వేడెక్కిపోతోంది. సెల్ఫ్ ప్ర‌మోష‌న్ కోసం గ్లామ‌ర్ షోలతో వీరు చేసే ర‌చ్చ అంతా ఇంతాకాదు.

తాజాగా ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో అంద‌రి హృద‌యాలు గెలుచుకున్న ఇస్మార్ట్ భామ న‌భా న‌టేష్ హీట్ పెంచే ప్ర‌య‌త్నం చేసింది. బాత్ రూంలో షార్ట్ డ్రెస్‌తో ఫొటోకు ఫోజులిచ్చిన ఈ అమ్మ‌డు ఆ ఫొటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటో నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతుంది. కొంద‌రైతే న‌భా.. ప్యాంట్ వేసుకోవ‌డం మ‌ర‌చిపోయావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొద్ది క్ష‌ణాల‌లోనే వైరల్ అయిన ఈ పిక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ప్యాంట్‌లెస్‌లో న‌భా ఇచ్చిన ట్రీట్ అదిరిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. న‌భా న‌టేష్ క‌న్న‌డ సినిమాలో న‌టించి ఆ త‌ర్వాత న‌న్ను దోచుకుందువ‌టే అనే సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. కెరీర్ మొద‌ట్లో పెద్దగా అవ‌కాశాలు పొంద‌లేక‌పోయిన ఈ అమ్మ‌డు ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ఫాంలోకి వ‌చ్చింది. రీసెంట్‌గా సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ అనే చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం నితిన్ సరసన ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది.