ఇకపై సమంతతో నాకు ఉన్న బంధం ముగిసినట్టే… చిన్మయి కామెంట్స్ వైరల్!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సమంత ఆ సినిమాలో నాగచైతన్యకి జోడిగా నటించింది. ఈ సినిమాలో సమంత తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తన మధురమైన గాత్రంతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే ఈ సినిమాలో సమంత మాట్లాడిన మాటలు అన్ని తనవి కావు. ఎందుకంటే ఈ సినిమాలో సమంత కి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. అంతే కాకుండా సమంత నటించిన అన్ని సినిమాలకు దాదాపుగా చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఇలా వీరిమధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

అయితే కష్ట సమయాలలో కూడా వీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. గతంలో చిన్మయి మీటూ ఆరోపణలు చేసినప్పుడు సమంత తన స్నేహితురాలికి బహిరంగంగా సపోర్ట్ చేసింది. అలాగే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సమంత డ్రెస్సింగ్ గురించి, అలాగే పుష్ప సినిమాలో సమంత నటించిన పాట గురించి విమర్శలు వచ్చినప్పుడు కూడా చిన్మయి సమంత కి మద్దతుగా మాట్లాడింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అంత అనుబంధం లేదని, వారి మధ్య ఉన్న రిలేషన్ చెడిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల ఈ వార్తలపై స్పందించిన చిన్మయి మాట్లాడుతూ.. సమంత వల్లే డబ్బింగ్ ఆఫీసుగా నాకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆమెతో ఉన్న అనుబంధం ముగిసిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం సమంత తాను నటించిన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. అందువల్ల ఇకపై భవిష్యత్తులో ఆమె నటించిన సినిమాలకు డబ్బింగ్ చెప్పే అవకాశం నాకు ఉండకపోవచ్చు. అందువల్ల మా ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్ ఇంతటితో ముగిసిందని నేను భావిస్తున్నాను. అయితే మా ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు. మేమిద్దరం కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయనంత మాత్రాన మేమిద్దరం విడిపోయినట్లు కాదు. మేమిద్దరం కలిసుందాం అని చెప్పటం వల్ల ఎవరికి ఉపయోగం? అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా నా భర్త రాహుల్ కూడా సమంత కి మంచి స్నేహితుడు. మేమందరం తరచూ కలుస్తూనే ఉంటాం అంటూ వెల్లడించింది.