Chiranjeevi: నాన్నే నా సూపర్ హీరో.. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకున్న చిరు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ చేస్తున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రతి ఏడాది జూన్ 3వ వారం ఫాదర్స్ డే ను ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఫాదర్స్ డే సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ తన తండ్రి కొనిదెల వెంకట్రావును గుర్తుచేసుకొని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

“పిల్లలు స్థిరంగా ఉండడానికి, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి నాన్న ఎంతో తోడ్పాటు అందిస్తారు. నా తండ్రి నా సూపర్ హీరో. తమ బలం, జ్ఞానం, ప్రేమతో జీవితాలను తీర్చిదిద్దే ప్రపంచంలోని అద్భుతమైన తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు” అంటూ తన తండ్రిని గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ ప్రపంచంలోని తండ్రులందరికి కూడా ఈయన ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

చిరంజీవి తండ్రి కానిస్టేబుల్ అనే విషయం మనకు తెలిసిందే. ఆయన ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు వెళ్లడంతో చిరంజీవి కూడా పలు ప్రాంతాలలో విద్యాభ్యాసం చేస్తూ తన చదువులను పూర్తి చేశారు అనంతరం నటనపై ఆసక్తితో చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయిన ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా చిరు వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే వశిష్ట దర్శకత్వంలో చేసిన విశ్వంభర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.